టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం..  గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు


టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.  గత బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన  గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.  ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19న వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల కాగా   3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.  2,80,000 మంది  ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు.  

అయితే ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీకేజ్ కావడంతో ఆ పరీక్ష రద్దయ్యింది.  దీంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు.  పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించలేదరంటూ పలువురు అభ్యర్థులు తెలుపుతూ  కోర్టును ఆశ్రయించారు. దీంతో  పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ  సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  కానీ వాదనలు వినిపించలేదు.  

ఇప్పటికే రెండుసార్లు రద్దయిన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది.  గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  దీంతో మొత్తం కలిపి  563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.