TSPSC ఉద్యోగాల స్టేటస్ బుక్ రిలీజ్

TSPSC ఉద్యోగాల స్టేటస్ బుక్ రిలీజ్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాంపల్లి పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆఫీస్ లో ఘనంగా జరిగాయి. కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే రాష్ట్రం అన్నిరంగాలలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26వేల 258ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. కొన్ని నిబంధనలలో స్పష్టత లేకపోవడం వల్లనే పోస్టులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు గంటా. ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయని దుష్ప్రచారం జరుతుందని ఆయన అన్నారు. TSPSC ఉద్యోగాల భర్తీకి సంబంధించిన స్టేటస్ బుక్ ను రిలీజ్ చేశారు.