
- టీజీపీడబ్ల్యూయూ ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్, వెలుగు: కార్మికుల భద్రత కంటే లాభాలే ముఖ్యమని కంపెనీలు భావిస్తున్నాయని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ అన్నారు. శనివారం మీర్ పేట దగ్గర భారీ వర్షం కురవడంతో ఓపెన్ డ్రైనేజీలో జొమాటో డెలివరీ వర్కర్ సయ్యద్ ఫర్హాన్ బైక్‌తో పాటు పడిపోయాడని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
ఆ వరదలో అతడి బైక్, మొబైల్ ఫోన్ కొట్టుకుపోయాయ్యని.. అదృష్టవశాత్తు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. జొమాటో మేనేజ్‌మెంట్ వెంటనే కొత్త మొబైల్ ఇవ్వడంతో పాటు బైక్ రిపేర్ చేయాలని.. అలాగే జరిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితుల రియల్-టైమ్ డేటాను వర్కర్లతో పంచుకోవాలని సూచించారు.