కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ డీకే అరుణ

కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ డీకే అరుణ
  • పాలమూరు  ఎంపీ డీకే అరుణ

జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని పాలమూరు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆదివారం జడ్చర్లలోని ఓ గార్డెన్​లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో రోడ్లు వేయిస్తున్నామని, అర్హులైన నిరుపేదలకు రేషన్  బియ్యం ఇస్తున్నామని తెలిపారు. స్ట్రీట్​ లైట్స్  నుంచి కిసాన్  సమ్మాన్  నిధులు, ఎరువులపై ఏడాదికి ఎకరానికి రూ.22 వేల సబ్సిడీ ఇస్తున్న ఘనత మోదీ సర్కారుదేనన్నారు.

 బీజేపీ పాలన చూసి ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వస్తున్నారని, ఇందులోభాగంగానే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేని ప్రజలు, రాజకీయ నాయకులు భావిస్తున్నారని తెలిపారు. గత పదేండ్లు పాలించిన బీఆర్ఎస్​ బాటలోనే కాంగ్రెస్  నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్​కు చిత్తశుద్ది ఉంటే 42 రిజర్వేషన్లు బీసీలకే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.