
ఇటీవల భారీ వర్షాలు పడుతుండడంతో వాటర్‌ఫాల్స్ జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చర జలపాతం వద్ద నీళ్లు పాలధారలా పరవళ్లు తొక్కుతున్నాయి. పచ్చటి ప్రకృతి నడుమ పారుతున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. - బోథ్, వెలుగు
రాష్ట్రానికి.. గుజరాత్ బ్యాలెట్ బాక్స్‌లు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణకు గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొస్తున్నారు. గుజరాత్‌లోని వివిధ జిల్లాల్లో 37,692 బాక్స్‌లు ఉండగా.. రాష్ట్రానికి 37,530 బాక్స్‌లను తెప్పిస్తున్నారు. ఆదిలాబాద్‌కు 1,030, నల్గొండ 4,120, హనుమకొండకు 1,380, జగిత్యాలకు 1,060, జయశంకర్ భూపాలపల్లికి 600, కరీంనగర్‌కు 730, ఖమ్మంకు 2,320, కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు 950, మహబూబాబాద్‌కు 970, మంచిర్యాలకు 970, మెదక్‌కు 1,110, ములుగుకు 650, నాగర్‌కర్నూల్‌కు 1,310, నారాయణపేట్‌కు 840 బాక్స్‌లు కేటాయించారు.
అలాగే నిర్మల్‌జిల్లాకు 830, నిజామాబాద్‌కు 3,440, పెద్దపల్లికి 1,650, రాజన్న సిరిసిల్లకు 1,470, రంగారెడ్డికి 1,730, సంగారెడ్డికి 1,590 బాక్స్‌లు పంపించనున్నారు. సిద్దిపేట జిల్లాకు 1,420, సూర్యాపేట 1,700, వికారాబాద్‌కు 1,460, వరంగల్ 1,110, యాదాద్రి భువనగిరి 1,260 బ్యాలెట్ బాక్స్‌లు రానున్నాయి. - మంచిర్యాల, వెలుగు