మార్కులు సమానముంటే .. డేటాఫ్ బర్త్ ఆధారంగా ర్యాంకులు

మార్కులు సమానముంటే  .. డేటాఫ్ బర్త్ ఆధారంగా ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ రిక్రూట్ మెంట్లలో సమానమైన మార్కులు వస్తే ర్యాంకులు ఇచ్చే అంశంపై టీఎస్​పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ వెబ్ సైట్​లో నోట్ పెట్టారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకుల కేటాయింపులో రాత పరీక్షలో ఇద్దరు అంత కంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు వస్తే  తెలంగాణ లోకల్ వారికి ప్రాధాన్యత ఇస్తారు.

దాంట్లోనూ తెలంగాణ అభ్యర్థులే ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్ కు ముందు ర్యాంకు కేటాయిస్తారు. పుట్టిన తేదీలు కూడా ఒకే రోజు అయితే సబ్జెక్టు పేపర్లలో వచ్చే మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే క్వాలిఫై ఎగ్జామ్ లో మార్కుల ఆధారంగా ర్యాంకులు అలాట్ చేస్తారు.