అగ్రికల్చర్​ కోర్సులతో ఆఫీసర్ జాబ్స్​

అగ్రికల్చర్​ కోర్సులతో ఆఫీసర్ జాబ్స్​

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయం, సహకార శాఖలో 148 వ్యవసాయ అధికారుల నియామకానికి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఏవో పోస్టులు మల్టీజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-1లో 100, మల్టీజోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2లో 48 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు : అభ్యర్థులు బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ (ఆనర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. జులై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.51,320 నుంచి -రూ.1,27,310 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్ ​: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. ఆన్​లైన్​లో జనవరి 10 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఏప్రిల్​ లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి. 

ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు
రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో 128 ఫిజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకానికి సంబంధించి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ జారీ చేసింది.  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హతలు : పోస్టును అనుసరించి మంచి అకడమిక్ రికార్డుతో ఎంపీఈడీ(ఫిజికల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/ ఫిజికల్ ఎడ్యుకేషన్ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.  రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  రాత పరీక్ష  ఏప్రిల్​లో నిర్వహించనున్నారు. వివరాలకు www.tspsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.