
తెలంగాణ పురపాలకశాఖలో 78 జూనియర్, సీనియర్ అకౌంటెంట్లు, అకౌంటెంట్ అధికారుల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
పోస్టులు: అకౌంట్స్ ఆఫీసర్(యూఎల్‌బీ)–1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(యూఎల్‌బీ)–13, సీనియర్ అకౌంటెంట్ (యూఎల్‌బీ)–64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి- 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1, పేపర్-2, సర్టిఫికెట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.