టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. మహా పోరాటానికి జంగ్ సైరన్ మోగిద్దాం.. రండి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. మహా పోరాటానికి జంగ్ సైరన్ మోగిద్దాం.. రండి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మహా పోరాటానికి జంగ్ సైరన్ మోగిద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థులు చిక్కడపల్లిలో రూ. 5 భోజనం అన్నం తింటూ కష్టపడి చదివారని చెప్పారు. నిరుద్యోగులు, విద్యార్థులు లేకపోతే తెలంగాణ లేదు, అవసరం లేకున్నా రూ.1200 కోట్ల సెక్రటేరియట్ లేదు, సీఎం పదవి లేదు, ప్రగతి భవన్ లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అన్ని పార్టీలను ఏకం చేసిన వ్యక్తి టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి ధన్యవాదాలన్న ఆయన.. మహా పోరాటానికి జంగ్ సైరన్ మోగిద్దామని పిలుపునిచ్చారు.

పేపర్ లీకేజ్ కేసులో సిటీ పోలీసులకు సమాచారం రాకపోతే ఇంకో 30 ఏళ్ళు పేపర్ లీకేజ్ జరిగేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనార్ధన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రవీణ్ క్వాలిఫై కాలేదని చిన్న విషయంగా చెప్పారని, పేపర్ లీకేజ్ ఛైర్మన్, సెక్రటరీ, మెంబర్స్ కు కూడా తెలుసని తెలిపారు. జనార్ధన్ రెడ్డి వ్యక్తిగతంగా ఎవరికీ శత్రువు కాదన్న ఆయన...15, 20 మంది పేపర్ దొంగతనం చేసి ఎగ్జామ్ రాసి టాపర్ అయ్యారని చెప్పారు. అంబేడ్కర్ జయంతి రోజు సీఎం కేసీఆర్ ను ఒకటే ప్రశ్నకు సమాధానం అడిగానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 2016 గ్రూప్ 1 టాపర్ ఎవరో చెప్పాలని, ప్రశ్న లడిగిన ఒక్క దానికి సమాధానం చెప్పలేదని ఆరోపించారు. 250 మంది సెక్యూరిటీల మధ్య సీఎం రెస్ట్ తీసుకుంటున్నారని ఆయన సెటైరికల్ కామెంట్స్ చేశారు.

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో వరంగల్ సీపీ 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ నిందితుడు అని చెప్పారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ కేసులో శంకర్ లక్ష్మిని ఎందుకు విచారణకు పిలవడం లేదని ప్రశ్నించారు.  డీజీపీ అంజనీ కుమార్, సీవీ ఆనంద్, ఏఆర్ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  టీఎస్పీఎస్సీ మెంబర్ చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిన విషయం  ఎవరికీ తెలియదని, కారం రవీందర్ రెడ్డి బయో డేటాను సైతం వెబ్ సైట్ లో తీసేశారని చెప్పారు. జైళ్లో ఉన్న 13 మంది నిందితులకు భద్రత లేదని ఆరోపించారు. పాత్ర దారులు, సూత్ర దారులు ప్రగతి భవన్, బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పారు.

టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, మెంబర్స్, టాపర్లు,  కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల ఫోన్లు తీసుకుంటే 2 నిమిషాల్లో దొంగలు దొరుకుతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. కేసు విచారణ దశలో ఉంటే పరీక్షల కొత్త తేదీలు ప్రకటించారని ఆరోపించారు. ఒక్క ఎగ్జామ్ కూడా కరెక్ట్ గా జరుగు తుందన్న నమ్మకం ఎవరికీ లేదని ఆయన అన్నారు. బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు ముట్టడించాలని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ కుట్రకు నిరుద్యోగుల జీవితాలు బలి అయ్యాయన్న ఆయన...2008 డీఎస్సీ బాధితులు 8 మంది మంత్రులను కలిసినా న్యాయం జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వాన్ని, సీఎంను బర్తరఫ్ చేయాలన్న ఆయన.. తెలంగాణను దోపిడీ దారుల నుంచి కాపాడు కోవాలి..రక్షించు కోవాలని చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని కోరారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.