
హైదరాబాద్, వెలుగు : నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్(ఏఎస్‌ఆర్‌టీయూ) అందించే ఐదు ఎక్సలెన్స్ అవార్డులను టీఎస్‌ఆర్టీసీ గెలుచుకుంది. 2022–-23లో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరిల్లో ఈ అవార్డులు దక్కాయి.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ చేతుల మీదుగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, అధికారులు అందుకున్నారు. రహదారి భద్రతలో ఫస్ట్, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో ఫస్ట్, అర్బన్ విభాగంలో సెకండ్, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ఫస్ట్, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను ఫస్ట్ ప్రైజ్లు దక్కాయి.