ఎలాంటి సమ్మె లేదు.. అద్దెబస్సు ఓనర్లతో ఆర్టీసీ చర్చలు సఫలం

ఎలాంటి సమ్మె లేదు.. అద్దెబస్సు ఓనర్లతో ఆర్టీసీ చర్చలు సఫలం

ఆర్టీసీలో  అద్దె బస్సుల సమ్మె లేదని చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.  జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పిన అద్దె బస్సుల యాజమాన్య సంఘం..  బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్  తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.

చర్చల అనంతరం మాట్లాడిన సజ్జనార్ ..అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. దీని కోసం  ఒక కమిటీని వేస్తామని తెలిపారు. జనవరి 5 నుంచి యధావిధిగా అద్దెబస్సులు నడుస్తాయని.. ఎలాంటి సమ్మె ఉండదని చెప్పారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుందని..స్పెషల్ బస్సులను తిప్పుతామని వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దెబస్సులు రన్ చేస్తున్నామని తెలిపారు. 

సమ్మె చేయడం లేదు

ఐదు సమస్యలను సజ్జనార్ కు విన్నవించామని ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యం ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి చెప్పారు. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారని చెప్పారు. జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 


మహాలక్ష్మి స్కీంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని దీంతో  బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అద్దె బస్సుల యజమానులు . బస్సులు  పాడై.. రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పారు.  ఈ క్రమంలో ఆర్టీసీతో అద్దెబస్సుల ఓనర్ల చర్చలు సఫలం కావడంతో సమ్మెలేదని చెప్పారు సజ్జనార్.