మరో స్ట్రోక్ : తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె

మరో స్ట్రోక్ : తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె

టీఎస్ ఆర్టీసీలో జనవరి 5 నుంచి  మరో సమ్మె మోగనుంది. అయితే ఈ సారి అద్దెబస్సుల యజమానులు సమ్మెకు దిగుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే  జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ఇప్పటికే ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. 

మహాలక్ష్మి స్కీంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని దీంతో  బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అద్దె బస్సుల యజమానులు . బస్సులు  పాడై.. రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందంటున్నారు.  ఇవాళ ప్రభుత్వంతో అద్దె బస్సుల యజమానులు చర్చలు జరపనున్నారు. ఒక వేళ చర్చలు విఫలమైతే జనవరి 5 నుంచి  సమ్మెకు దిగాలని భావిస్తున్నారు. ఒక వేళ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగితే మహాలక్ష్మికి బస్సుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.  రాష్ట్రంలో మొత్తం 2700 అద్దె బస్సులు ఉన్నాయి. 

హైదరాబాద్ లో 300ల అద్దె బస్సులు నడుస్తున్నాయి.   ఫ్రీ బస్సు జర్నీకి బస్సులు సరిపోకపోవడంతో డిసెంబర్ లో   340 అద్దె బస్సుల కోసం ప్రభుత్వం టెండర్ల నోటిఫికేషన్ ఇచ్చింది.  అయితే 50  అద్దె బస్సులకే టెండర్లు వచ్చాయి. మిగతా బస్సులకు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి  రాష్ట్రంలో రోజుకు దాదాపు 30 లక్షల మంది మహిళలు జర్నీ చేస్తున్నారు. జనవరి 3 వరకు దాదాపు రు 6.50 కోట్ల మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయానం చేశారు.