టీఆర్టీ నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ నోటిఫికేష్ ద్వారా 5వేల 89 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖలో ఎక్కువ మంది ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని మంత్రి సబిత తెలిపారు. గురుకులాల్లో ఇప్పటికే 12 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామని.. దీంతోపాటు 1532 స్పెషట్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కేజీ టు పీజీ విద్య అందరికి అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబిత అన్నారు.
గురుకులాల్లో గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని అన్నారు మంత్రి సబిత. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేశామన్నారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామన్నారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి సబిత తెలిపారు.
ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్, విధివిధానాలు రెండ్రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు.
