బిగ్ బ్రేకింగ్ : జపాన్ సముద్రంలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు

బిగ్ బ్రేకింగ్ : జపాన్ సముద్రంలో భారీ భూకంపం : సునామీ హెచ్చరికలు

జపాన్ దేశంలో భారీ భూకంపం వచ్చింది. జపాన్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ ల్యాండ్స్ లో.. సముద్రంలో ఈ భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 6.6 తీవ్రతగా నమోదైంది. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. 2023, అక్టోబర్ 5వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో గుర్తించినట్లు వివరించారు అధికారులు.

సముద్రంలో భారీ భూకంపంతో.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ దేశం. పసిఫిక్ మహా సముద్రం తీరంలో అలలు ఎగిసిపడనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అలలు మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడొచ్చని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని.. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

సునామీ హెచ్చరికలు ఉన్నా.. తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చని.. ప్రాణ, ఆస్తి నష్టం ఉండకపోవచ్చని స్పష్టం చేసింది జపాన్ దేశం. భూమిపై అత్యధిక భూకంపాలు సంభవించే ప్రదేశాలలో జపాన్ ఒకటి. 2011లో సంభవించిన భారీ భూకంపం, సునామీ కారణంగా ఉత్తర జపాన్‌లోని భారీ భూభాగాలు నాశనమయ్యాయి.