
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించింది టీటీడీ పాలకమండలి. మంగళవారం ( సెప్టెంబర్ 16 ) తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలకమండలి. బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి. అలాగే.. క్రౌడ్ మేనేజ్ మెంట్ కోసం ఇస్రో సహకారంతో చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది పాలకమండలి.
టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, వాదనలు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మెన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.న సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 24న సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని.. 25న పిఏసి -5 ను ప్రారంభిస్తారని అన్నారు.
ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజ్ మెంట్ పై చర్యలు:
ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ పై చర్యలు తీసికుంటున్నామని అన్నారు బీఆర్ నాయుడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని.. విఐపి దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు బీఆర్ నాయుడు. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా పది లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని తెలిపారు.
భక్తులు బ్రహ్మోత్సవాల వాహన సేవలు తిలకించేలా, రద్దీ ప్రాంతాలలో ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటు చేస్తున్నామని.. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.గరుడ సేవ నాడు శ్రీవారి మెట్డు నడక మార్గంలో 24. గంటలు భక్తులను అనుమతిస్తామని తెలిపారు.
టిటిడిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని.. ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు మండిపడ్డారు చైర్మెన్ బీఆర్ నాయుడు. ఇకపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నాటక బెల్గావ్ లో 7 ఎకరాలలో శ్రీవారి నిర్మించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలకమండలి.