కొండగట్టు, వెలుగు : కొండగట్టు అంజన్న భక్తుల కష్టాలు తీరనున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి గుట్టపైన వసతి సౌకర్యం లేక ఆరు బయట నిద్రించే భక్తులకు ఇకనుండి 100 గదులు అందుబాటులోకి రానున్నాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో టీటీడీ 100 గదులు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా శనివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టీటీడీ ఆలయ డీఈ పీవీ ఆలయ డీఈ నాగరాజు
ఏఈ జె నాగరాజులు కలిసి గుట్టపైన గదుల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఆలయ ఈవో రామకృష్ణారావు ఏఈఓ అంజయ్య, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, స్థానాచార్యుడు కపిందర్, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కమలాకర్ రెడ్డి, ఆది రెడ్డి, ముత్యం శంకర్ అజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.