తిరుమల వెంకన్న మే నెల దర్శన టికెట్లు ఫిబ్రవరి 19న విడుదల

తిరుమల వెంకన్న మే నెల దర్శన టికెట్లు ఫిబ్రవరి 19న విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)  మే నెల దర్శన టిక్కెట్లను ఫిబ్రవరి 19న  టీటీడీ విడుదల చేయనుంది.  సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్‌ ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది.మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.  శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్లను 22వ తేది ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లను విడుదల చేయనుంది.

ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 21వ తేది ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడీప్​ విధానంలో పొందడానికి రిజిష్ర్టేషన్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తుల జాబితా విడుదల చేయనున్నది. 23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.