వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శనం

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆంక్షలు విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తులు రెండు డోసులు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని.. అది లేకపోతే దర్శన సమయానికి 72 గంటల ముందు చేసుకున్న RTPCR నెగిటివ్ సర్టిఫికెట్ కానీ తేవాలని నిబంధన విధించామన్నారు. 18 ఏళ్ళ లోపు వారికి వ్యాక్సిన్ లేనందువల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహార్ రెడ్డి తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవన్ దగ్గర ఇవాళ( శుక్రవారం) మీడియాతో మాట్లాడారు ఈవో జవహార్ రెడ్డి. అక్టోబర్ 11 వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం YS జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. అలిపిరి నుంచి తిరుమల నడక దారిని బ్రహ్మోత్సవాలలో అందుబాటులోకి తెస్తామన్నారు.  అలిపిరిలో దాత నిర్మించిన గోమందిరం, తిరుమలలో దాత నిర్మించిన బూందీ పోటును సీఎం  ప్రారంభిస్తారని... బర్డ్ ఆస్పత్రిలో టీటీడీ ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె సంబంధిత వ్యాధుల చికిత్స ఆస్పత్రిని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు ఈవో.