మరో ముగ్గురు SVBC ఉద్యోగుల సస్పెండ్

V6 Velugu Posted on Apr 05, 2021

తిరుమల వెంకన్న భక్తి చానల్ SVBC లో అశ్లీల చిత్రాల వ్యవహారానికి సంబంధించి మరో ముగ్గురిపై ఇవాల వేటు పడింది. SVBC ఎడిటర్ కృష్ణారావు, మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్ లను సస్పెండ్ చేశారు. SVBC అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిని సస్పెంట్ చేసింది. ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియోలు ఉన్నట్టు టీటీడీ సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.

గతంలో ఓ భక్తుడు ఎస్వీబీసీ చానల్లో ప్రసారమయ్యే 'శతమానం భవతి' కార్యక్రమానికి ఈమెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగి ఎంతో నిర్లక్ష్యపూరితంగా ఓ అశ్లీల వీడియో లింకు పంపాడు. దాంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటనపై వైవీ విచారణకు ఆదేశించారు. చానల్లోని పలువురు కీలకస్థానాల్లో ఉన్న ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు గుర్తించి, అప్పట్లోనే కొందరిని సస్పండ్ చేశారు.

Tagged TTD, SVBC

Latest Videos

Subscribe Now

More News