దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం

V6 Velugu Posted on Jun 19, 2021

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.  ఇవాళ (శనివారం)జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. సమావేశం తర్వాత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. 18 నెలల్లో కశ్మీర్ లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. TTD ఆధ్వర్యంలో ఉన్న ప్రతి గుడిలో ఓ గోమాతను ఉంచుతామని తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని దాదాపు 100 గుళ్లలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. 

TTD పరిధిలో అన్ని విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజుల్లో దీనికి సంబంధించిన ముసాయిదాను తీసుకురాబోతున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని పర్మినెంట్ విధానంలో నియమిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ధాన్యంతో స్వామివారికి నైవేద్యం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సహజ పంటలపై అన్ని జిల్లాలకు చెందిన రైతులతో త్వరలోనే చర్చిస్తామని తెలిపారు.

Tagged TTD, kashmir, build Venkateswara temple, 18 months

Latest Videos

Subscribe Now

More News