తిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి

తిరుమలలో ఇక గాజు సీసాతోనే వాటర్ తాగాలి

తిరుమలలో తాగునీటి కోసం భక్తులకు గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రేపటి నుంచి ఈ గాజు సీసాలను  భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడి ఆరోగ్య శాఖా అధికారి‌ ఆర్ఆర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో గాజు వాటర్ బాటిల్ మోడల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… 750 మి.లి గల ఒక గాజు బాటిల్ ధర రూ. 20 అని చెప్పారు. వాటర్ తాగిన తర్వాత ఖాళీ గాజు బాటిల్ ను తిరిగి దుకాణ దారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒక వేళ  గాజు సీసా కావాలంటే మరో రూ. 20 అదనంగా దుకాణదారులకు చెల్లించాలన్నారు. గాజు బాటిల్స్ కు మంచి ఆదరణ లభిస్తే వాటినే కొనసాగిస్తామన్నారు. దీంతో పాటు ఈ నెల 19 నుంచి ఖాళీ రాగి, మట్టి వాటర్ బాటిల్స్ కూడా భక్తులకు  అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

see more news

సిద్దిపేట కాల్పుల్లో ట్విస్ట్..ఆ తుపాకులు పోలీసులవే

హైదరాబాద్ లో బ్రిడ్జిపై నుంచి పడ్డ కారు..ఒకరు మృతి

క్రికెట్ గాడ్ సచిన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్