బీజేపీకి బిగ్ షాక్.. తుల ఉమ రాజీనామా

బీజేపీకి బిగ్ షాక్.. తుల ఉమ రాజీనామా

వేములవాడలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.  తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు.  తన రాజీనామాకు గల కారణాలన్నింటినీ తుల ఉమ లేఖలో వివరించారు. సిరిసిల్ల జిల్లా బీఅర్ఎస్ పార్టీ భవనంలో జిల్లా నాయకులతో  తుల ఉమ ఆమె అనుచర వర్గం సమావేశమైంది.  

ఇవాళ ఉమ  ప్రగతి భవనంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. కాగా తుల ఉమ బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ఆశించారు. అధిష్టానం ఆమెకే టికెట్ కేటాయించింది. కానీ చివరి నిమిషంలో ఆమెకు బీఫామ్ ఇవ్వకుండా  యూటర్న్ తీసుకుని ఆమె స్థానంలో చెన్నమనేని  వికాస్ రావుకు బీఫామ్  ఇచ్చింది.