బీజేపీకి ఓట్లేసిన వారికే వ్యాక్సిన్ ఇస్తారా?

బీజేపీకి ఓట్లేసిన వారికే వ్యాక్సిన్ ఇస్తారా?

పాట్నా: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సీరియస్ అయ్యారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉండదా అని రౌత్ ప్రశ్నించారు. ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ రోడ్ మ్యాప్ గురించి చెప్పారని.. ప్రతి భారతీయుడికి వ్యాక్సిన్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారని క్వశ్చన్ చేశారు.

‘బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడిన చోట్ల మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చేలా వాళ్లు విధానాన్ని రూపొందించారు. మేం స్కూళ్లలో చదువుకునే రోజుల్లో.. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తా అనే నినాదాన్ని వినేవాళ్లం. ఇప్పుడు మీరు మాకు ఓటేయండి, మేం మీకు వ్యాక్సిన్ ఇస్తాం అనే నినాదాన్ని వింటున్నా. ఆ లెక్కన ఎవరైతే బీజేపీకి ఓట్లు వేస్తారో వాళ్లకే వ్యాక్సిన్ అందుతుంది. ఇది ఆ పార్టీ వివక్షతకు అద్దం పడుతోంది’ అని రౌత్ పేర్కొన్నారు.