
- హోమియోపతిక్ మెడిసిన్ లో గోల్డ్ మెడల్ సాధించిన చరిత
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కర్నాటకలో ఖమ్మం బిడ్డ సత్తా చాటింది. --హోమియోపతిక్ మెడిసిన్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన తుమ్మలపల్లి చరిత 2019 నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించి, బెల్గామ్లోని ఏ.ఎం.షేక్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో బీహెచ్ఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) కోర్సులో జాయిన్ అయ్యింది. కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న కొద్ది నెలలకే ఆమె తండ్రి రామారావు అకస్మాత్తుగా మృతి చెందారు.
తండ్రి లేని బాధను దిగమింగుతూ అండర్ గ్రాడ్యుయేషన్ నాలుగేండ్లలో ఏటా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఫలితంగా హోమియోపతిక్ మెడిసిన్ లో టాపర్ గా నిలిచి, గోల్డ్ మెడల్ అందుకోవడమే కాకుండా ప్రతిష్ఠాత్మక డాక్టర్ బత్రాస్ స్కాలర్షిప్ కు ఎంపికైంది. కాలేజీ చరిత్రలోనే సొంత రాష్ట్రం వారు కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన అమ్మాయి గోల్డ్ మెడల్ అందుకోవడం ఇదే తొలిసారి. కాన్వకేషన్ కార్యక్రమంలో తల్లి విజయలక్ష్మి తో పాటు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.