
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర డ్యామ్కు కొత్త గేట్లను ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు నడుం బిగించింది. చెడిపోయిన 33 గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను పిలిచింది. డ్యామ్‌లో పాడైన స్పిల్ వే గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు.. క్వాలిటీ అష్యూరెన్స్, మేనేజ్మెంట్, ఇన్స్పెక్షన్, టెస్టింగ్, క్వాలిటీ కంట్రోల్, డ్యామ్ స్పిల్ గేట్ వర్క్ పర్యవేక్షణలనూ చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆసక్తి ఉన్న సంస్థలు శుక్రవారం నుంచి బిడ్లను దాఖలు చేయాలని సూచించింది. వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల లోపు టెండర్లు దాఖలు చేయాలని సూచించింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు బిడ్లను ఓపెన్ చేస్తామని తెలిపింది. మరిన్ని వివరాలకు tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొంది.