తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు

తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు

ఎండలు మండిపోతున్న సమయంలో తుంగభద్ర రిజర్వాయర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 30 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు ఈ ఏడాది సాధ్యమైంది. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో  ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది.  జలాశయంకు వస్తున్న వరదల కారణంగా 30ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో నీటి నిల్వలు చేరాయి. మే నెలలో ప్రతిసారీ తుంగభద్ర జలాశయంలో నీటినిల్వ తగ్గుతుంది... కానీ ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 34 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 26 వేల 987 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 584 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1608.95 అడుగులకు చేరుకుంది. 

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రానికి వర్ష సూచన

చివరి గింజ వరకు కొంటాం

మోసపోయిన రిషబ్ పంత్..