చివరి గింజ వరకు కొంటాం

చివరి గింజ వరకు కొంటాం

కరీంనగర్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ రెండు వారాల్లో పూర్తవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం సేకరణ తీరుపై ఆయన మాట్లాడుతూ... జూన్ 10లోగా ధాన్యం సేకరణ మొత్తం పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి ప్రకటించారు. అకాల వర్షాలకు తడిసిన దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా... ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని గంగుల స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు చివరి గింజ వరకు కొంటామని, రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం...

ప్రజలు తిప్పలు పడుతుంటే పంజాబ్లో గొప్పలు చెప్పిండు

హత్యాయత్నం నుంచి తప్పించుకున్న పుతిన్..!