హత్యాయత్నం నుంచి తప్పించుకున్న పుతిన్..!

హత్యాయత్నం నుంచి తప్పించుకున్న పుతిన్..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఆయనపై 2 నెలల క్రితం హత్యాయత్నం జరిగినట్లు ఉక్రెయిన్ సైనికాధికారి ఒకరు ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పుతిన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పుతిన్ ను చంపే ప్రయత్నం జరగగా.. ఆయన దాని నుంచి బయటపడ్డారని ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేనేజర్ కిరిలో బుడనోవ్ వెల్లడించారు. బ్లాక్, కాస్పియన్ సీ మధ్య ఉన్న కౌకసన్ ప్రాంతంలో హత్యాయత్నం జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. 

పుతిన్ ఆరోగ్యంపై ఈ మధ్య అనేక వార్తలు వస్తున్నాయి. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇటీవలే సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. పుతిన్‌కు సన్నిహితులైన వ్యక్తులు సైతం ఈ విషయాన్ని నిర్థారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పుతిన్ పై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి కాదు.. ఆయన గతంలో ఐదుసార్లు హత్యాయత్నం నుంచి బయటపడినట్లు 2017లో స్వయంగా వెల్లడించారు. తన భద్రత గురించి తానేమీ ఆందోళన చెందడం లేదని అప్పట్లో ఆయన చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ టీంలో పీకే మాజీ సహచరుడు

మోసపోయిన రిషబ్ పంత్..