పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?

పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో?

సీఎం కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ పర్యటనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ పంజాబ్లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదన్నారు. ఆ చెక్కులు డ్రా చేసేదాకా లబ్దిదారులకు టెన్షనేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, లబ్దిదారులకు పింఛన్లు అందడం లేదన్నారు. తెలంగాణాలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. TRS నేతలు జైహనుమాన్ అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనమేనన్నారు. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావడమే అతిపెద్ద సంచలనమని వ్యాఖ్యానించారు. దేశ యాత్రలతో కేసీఆర్ సాధించేది ఏమీ ఉండదని సెటైర్లు వేశారు. పెట్రోల్‌పై వ్యాట్‌తో రాష్ట్ర ప్రభుత్వం రూ.60వేల కోట్లు సంపాదించిందన్నారు. కేంద్రం సహకరిస్తున్నా.. అబద్దాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సవ్యంగా సాగడం లేదని.. దాని గురించి ఆలోచించకుండా.. పంజాబ్‌ వెళ్తారా? అంటూ ఫైరయ్యారు బండిసంజయ్.