V6 News

హైదరాబాద్‌‎లో రూ.300 కోట్లతో టన్నెల్ అక్వేరియం

హైదరాబాద్‌‎లో రూ.300 కోట్లతో టన్నెల్ అక్వేరియం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కొత్వాల్ గూడలో ప్రపంచ స్థాయి టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేయాలని  పొలిన్ అక్వైరియమ్స్‌‌‌‌‌‌‌‌, మల్టివర్స్ హోటల్స్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, కాడోల్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ కన్సార్టియం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ (పీపీపీ) మోడ్‌‌‌‌‌‌‌‌లో రూ. 300 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు.  పొలిన్ అక్వైరియమ్స్‌‌‌‌‌‌‌‌ సాంకేతిక భాగస్వామిగా పనిచేస్తుంది. మల్టీవర్స్‌‌‌‌‌‌‌‌ హోటల్స్‌‌‌‌‌‌‌‌కు   హాస్పిటాలిటీ  సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనుభం ఉంది. కాడోల్ గ్రూప్  ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్‌‌‌‌‌‌‌‌, నిర్మాణ, పర్యావరణ అనుమతులు ఇస్తుంది.  

ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది. 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా దీనిని నిర్మిస్తామని పొలిన్ అక్వైరియమ్స్ తెలిపింది. 100 మీటర్ల పొడవైన కర్వ్‌‌‌‌‌‌‌‌ టన్నెల్ ట్యాంకులు, 3.5 మీటర్ల వెడల్పు వాక్‌‌‌‌‌‌‌‌వే, 3 మిలియన్ లీటర్ల నీటి సామర్థ్యం, 3వేల మంది వీక్షకుల సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంది. 300 రకాలకు చెందిన పది వేల నీటి, భూ సంబంధిత  జీవులను ప్రదర్శనకు ఉంటాయని,  అండర్‌‌‌‌‌‌‌‌వాటర్ రెస్టారెంట్ వంటి ప్రత్యేకతులు ఉంటాయని తెలిపింది.