Good Health : మన వంటింట్లో మెడికల్ షాపు ఉంది తెలుసా..

Good Health : మన వంటింట్లో మెడికల్ షాపు ఉంది తెలుసా..

ఇప్పుడంటే వేలల్లో... కాదు కాదు లక్షల్లో హాస్పిటల్స్, తుమ్ము, దగ్గుకి ట్యాబ్ లెట్స్. కానీ, ఇవేం లేని రోజుల్లో వంటిల్లే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ ప్రతి అరలో ఓ మెడిసిన్ ఉంటుంది.

మలబద్దకం పోవాలంటే ఎప్సమ్ సాల్ట్ వాడాలి. రెండు టీ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను ఒక కప్పు నీళ్లలో లేదా ఫ్రూట్ జ్యూస్ లో కలిపి ప్రతిరోజూ తాగాలి. ఈ సాల్ట్ ఉండే మెగ్నీషియం కండరాలను రిలాక్స్డ్ ఉంచుతుంది. అందుకే బాత్బన్ను గోరువెచ్చటి నీళ్లతో నింపి. వాటిలో రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్ వేసి కలపాలి. ఆ నీళ్లలో 20 నిమిషాలు ఉంటే బోలెడంత రిలాక్సేషన్.

  • ఇన్న్ నెయిల్స్ అంటే కాలిబొటన వేలు పక్కన కండ పెరగడం... దీనివల్ల నొప్పి, వాపు ఉంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. 
  • ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎప్సమ్ సాల్ట్ కలిపిన నీళ్లలో రోజుకు రెండుసార్లు పావుగంట నుంచి 25 నిమిషాలు పాదాలను నీళ్లలో నానబెట్టాలి. ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది.
  • వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే నోట్లో కావిటీస్, చెవి ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిక్ నొప్పుల మీద పోరాడుతుంది వెల్లుల్లి. 
  • దీన్ని పచ్చిగా తింటే హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. వేగించి లేదా ఉడికించి తింటే మెడిసినల్ గుణాలు పోతాయి. 
  • కీళ్ల లేదా కండరాల నొప్పులు ఉంటే నొప్పి ఉన్న దగ్గర గోరువెచ్చటి వెల్లుల్లినూనె పూయాలి. 
  • పన్ను నొప్పి ఉంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలను నలిపి అందులో కొంచెం ఉప్పు వేసి నొప్పి పంటి మీద రాయాలి. పసుపులో కుర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది.
  • ఇది నొప్పుల నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దానివల్ల కీళ్ల, కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి.
  • యాంటీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీవైరల్, యాంటీకార్సినోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపులో. అందుకని భోజనంలో దీన్ని వాడితో ఆరోగ్యం బాగుంటుంది.
  • చర్మం మీద దురద పెట్టినా లేదా పురుగులు కుట్టిన దగ్గర పసుపు, కలబంద గుజ్జు సమపాళ్లలో కలిపి రాయాలి.
  • నోట్లో అల్సర్లు ఉంటే చిటికెడు పసుపులో ఒక టేబుల్ స్పూన్ నీళ్లు, అరటేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపిన పేస్ట్ రాయాలి. 
  • యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు కలిగిన లవంగాలు నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటాయి. 
  • పంటినొప్పి ఉంటే రెండు లవంగాలను గ్రైండ్ చేసి ఆ పొడిలో కొంచెం ఆలివ్ నూనె వేసి కలపాలి. 
  • ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి. లేదంటే ఒక లవంగాన్నినోట్లో పెట్టుకుని నమిలినా అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది. 
  • నొప్పి, వాపులను తగ్గించే గుణం ఉంది లవంగానికి. 
  • అందుకే కొంచెం లవంగం నూనె వేడిచేసి, నొప్పి ఉన్న దగ్గర మసాజ్ చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది.