తుషార్ కపూర్ 'మారిచ్' విడుదలకు ముహూర్తం ఖరారు

తుషార్ కపూర్ 'మారిచ్' విడుదలకు ముహూర్తం ఖరారు

తుషార్ కపూర్ లెటెస్ట్ మూవీ 'మారిచ్' (Maarrich) విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. NH స్టూడియోస్‌తో కలిసి తుషార్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను రూపొందించగా Dhruv Lather దర్శకత్వం వహించారు. కపూర్ తో పాటు నరేంద్ర హిరావత్, శ్రేయాన్స్ హిరావత్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో కపూర్ పోలీస్ అధికారి పాత్రను పోషించారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని కపూర్ వెల్లడించారు.

’లక్ష్మీ‘ అనంతరం నిర్మాతగా ‘మారిచ్’ తనకు రెండో సినిమా అని, చాలాకాలం తర్వాత నసీరుద్దీన్ షాతో నటించడం జరిగిందన్నారు. గతంలో నటించిన సినిమాలకంటే ఈ మూవీ డిఫరెంట్ గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో తన పాత్రను ప్రేక్షకులు ఇష్టపడుతారన్నారు. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. 2011లో వచ్చిన ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో కపూర్, షాలు నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ‘మారిచ్’ తెరకెక్కింది.