ప్రముఖ టెలివిజన్ నటి చంద్రికా సాహా.. తన 15నెల కొడుకుని గాయపరిచాడని భర్తపై పోలీస్ కంప్లయిట్ ఇచ్చింది. అదాలత్, సి.ఐ.డి, క్రైమ్ అలర్ట్ వంటి షోలతో ఫేమస్ అయిన ఆమె.. 2020 నుండి వ్యాపారవేత్త అయిన మిశ్రాతో రిలేషన్ లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే.. తాను బిడ్డని కనడం మిశ్రాకి ఇష్టం లేదని, ఆ కోపంతోనే మిశ్రా తన బిడ్డని గాయపరిచాడాని పోలీసులతో చెప్పుకొచ్చింది చంద్రికా సాహా.
ఇక ఓ సీరియల్ షూటింగ్ లో బాగంగా.. తన కొడుకుని చూసుకోవాలి మిశ్రాకు చెప్పానని, కాసేపటికి రూమ్ నుండి ఒక శబ్ధం వినిపించిందని, ఆతరువాత మరో మూడుసార్లు శబ్ధాలు వినిపించాయని చెప్పుకొచ్చింది. ఏం జరిగినది అని బెడ్ రూమ్ లోకి వెళ్ళి చూడగా.. గాయాలతో తన కొడుకు కిందపడి ఉన్నాడని చెప్పింది. దాంతో.. వెంటనే తన బాబుని హాస్పిటల్ కి తరలించామని, ఇప్పుడు అతని పరిస్థితి బాగానే ఉందని ఆమె వివరించింది.
ఇక జరిగిన సంఘటనని సీసీ టీవీలో గమనించగా.. మిశ్రా తన బాబుని తలకిందులుగా మూడుసార్లు నెల కేసి కొడుతూ కనిపించాడు. దీంతో.. తన బిడ్డని చంపడానికి మిశ్రా ప్రయతనించాడని అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది చంద్రికా సాహా.