చిక్కుల్లో టీవీకే అధినేత విజయ్... అఫిడవిట్లలో పొంతనలేని వివరాలు

చిక్కుల్లో టీవీకే అధినేత విజయ్... అఫిడవిట్లలో పొంతనలేని వివరాలు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వేళ తమిళగ వెట్రి కజగం (టీవీకే) వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలో వివరాలు పొంతన లేకపోవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ కోసం ఆయన సమర్పించిన పత్రాల్లో నేర చరిత్ర,  బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు వేర్వేరుగా ఉండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పెరంబూర్ అఫిడవిట్ లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని విజయ్ పేర్కొన్నారు. మూడు రోజుల తర్వాత తిరుచిరాపల్లిలో సమర్పించిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో మాత్రం తనపై రెండు ఎఫ్ఐఆర్ లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో మధురై జిల్లాలోని కూడకోవిల్ పీఎస్​లో ఒకటి, చెన్నైలోని పెరవల్లూరు పీఎస్​లో మరొకటి నమోదైనట్లు తెలిపారు.