టీవీఎస్ చైర్మన్‌‌‌‌‌‌ వేణు శ్రీనివాసన్‌‌‌‌కు ఏఐఎంఏ అవార్డ్‌‌‌‌

టీవీఎస్ చైర్మన్‌‌‌‌‌‌ వేణు శ్రీనివాసన్‌‌‌‌కు ఏఐఎంఏ అవార్డ్‌‌‌‌

న్యూఢిల్లీ : టీవీఎస్ లాంటి సంస్థను నిర్మించిన కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్‌‌‌‌కు ప్రతిష్టాత్మకమైన ‘అవుట్‌‌‌‌స్టాండింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్ బిల్డర్’ అవార్డ్ దక్కింది. ఆల్‌‌‌‌ ఇండియా మేనేజ్‌‌‌‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 2023 కి గాను ఈ అవార్డ్‌‌‌‌కు ఆయన్ని ఎంపిక చేసింది. ఒక ఆర్గనైజేషన్‌‌‌‌ను నిర్మించడంలో  అసాధారణమైన లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ స్కిల్స్‌‌‌‌, విజన్‌‌‌‌తో ముందుకెళ్లిన వారికి ఈ అవార్డు ఇస్తారు. ఏఐఎంఏ ఇస్తున్న ఈ అవార్డును కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా వేణు శ్రీనివాసన్‌‌‌‌కు అందజేశారు. గత నలభై ఏళ్లుగా తనతో పాటు పనిచేసిన వారికి ఈ అవార్డు దక్కిందని, కంపెనీని భారీ సంస్థగా మార్చడంలో వీరి పాత్ర ఉందని వేణు చెప్పారు.