టీటీడీ కొత్త సభ్యుడుగా టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణు.

టీటీడీ కొత్త సభ్యుడుగా టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణు.

ప్రముఖ వ్యాపారవేత్త టీవీఎస్ మోటార్స్ CMD సుదర్శన్ వేణును టీటీడీ బోర్డు కొత్త సభ్యుడిగా నియమించింది ఏపీ సర్కార్. ఈమేరకు గురువారం ( సెప్టెంబర్ 11 ) ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గతంలో నియమితులైన ఓ సభ్యుడు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఖాళీగా ఉన్న స్థానాన్ని  సుదర్శన్ వేణు నియామకంతో భర్తీ చేశారు. గతంలో 29 మందితో టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేసింది ప్రభూత్వం.

అప్పట్లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఎంపికైన జస్టిస్ హెచ్.ఎల్. దత్తు తన బాధ్యతలు స్వీకరించకపోవడంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న సభ్యుడి స్థానాన్ని భర్తీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. జస్టిస్ దత్తు స్థానంలో సుదర్శన్ వేణును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

టీటీడీ బోర్డు సభ్యుడిగా సుదర్శన్ వేణు నియామకంతో పాలకమండలి పూర్తి స్థాయిలో కొలువుదీరినట్లయ్యింది. త్వరలోనే సుదర్శన్ వేణు టీటీడీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.