గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మూడో అతిపెద్ద టూవీలర్ కంపెనీ టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మూడో అతిపెద్ద టూవీలర్ కంపెనీ టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియన్ కంపెనీ టీవీఎస్ మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద టూవీలర్ల తయారీ కంపెనీగా ఎదిగింది. మార్కెట్ క్యాప్ పరంగా  యమహా మోటార్స్​ను అధిగమించింది.  టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఆరు నెలల్లో 37 శాతం పెరిగి 9.2 బిలియన్ డాలర్లకు ఎగసింది. మరోవైపు జపనీస్ కంపెనీ యమహా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్ ఈ ఏడాది ఆగస్టు నుంచి 1.6 బిలియన్ డాలర్లు తగ్గింది.

శుక్రవారం నాటికి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది టీవీఎస్ మోటార్ మార్కెట్ క్యాప్ కంటే 348 మిలియన్ డాలర్లు తక్కువ. మార్కెట్ క్యాప్ పరంగా గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5  టూవీలర్ల తయారీ కంపెనీల్లో  నాలుగు ఇండియా నుంచే ఉన్నాయి. 19 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బజాజ్ ఆటో  టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. 11.5 బిలియన్ డాలర్లతో ఐషర్ మోటార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, 8 బిలియన్ డాలర్లతో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హీరో మోటో కొనసాగుతున్నాయి.