సెప్టెంబర్ నెలలో 12 సినిమాలు.. హిట్ కొట్టేది ఎవరు..?

సెప్టెంబర్ నెలలో 12 సినిమాలు.. హిట్ కొట్టేది ఎవరు..?

టాలీవుడ్,కోలీవుడ్, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా శుక్రవారం వచ్చిందంటే సినిమాల పండుగే కనిపిస్తుంది. ఇక ఏకంగా సెప్టెంబర్ నెల అంతా పండుగనే చెప్పుకోవాలి. సినిమా లవర్స్కి..వీకెండ్ దొరికితే చూడటానికి టైం చాలకుండా..ఏకంగా 12 సినిమాలు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో,ఓటీటీలో రిలీజ్కు రెడీ గా ఉన్న మూవీస్తో ఫెస్టివల్ ఫీల్ క్రియేట్ కాబోతుంది. అందులో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ ఏమున్నాయో తెలుసుకుందాం. అలాగే హీరో ఎవరో..ఏ సినిమాకి ఆడియన్స్లో క్రేజీ ఎక్కువగా ఉందో ఒక లుక్కేద్దాం. 

టాలీవుడ్ మూవీస్ పైనే ఇండియా వైడ్ గా టాక్ నడుస్తుంది.మన తెలుగు హీరోస్ చేసే సినిమాలలో కంటెంట్ తో పాటు యాక్టింగ్ లో క్రేజీ ఎక్కువ కావడంతో ఆడియన్స్ ఫోకస్ టాలీవుడ్ పైనే కనిపిస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు పోటీగా ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. 

సెప్టెంబర్ 1:

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఆపిల్ బ్యూటీ సమంత నటిస్తున్న మూవీ ఖుషి(Kushi). శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీపై ఆడియన్స్ లో క్రేజీ పీక్స్ లో కనిపిస్తోంది.ముఖ్యంగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ వచ్చే నెల సెప్టెంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. 

ఖుషి మూవీతో మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్స్కు థియేట్రికల్ డీల్స్ ద్వారా రూ.60 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఖుషి మూవీకు నాన్ థియేట్రికల్ వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి. ఓవరాల్‌గా ఈ సినిమా విడుదలకు ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ఖుషి మూవీతో విజయ్ ముందుగానే..ట్రాక్​ ​రికార్డ్ సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండకు ఈ రేంజ్​లో బిజినెస్ జరగడమంటే..ఇక పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.ఈ మూవీతో సమంత తిరిగి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తుంది.  

ఇక సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పాన్ ఇండియా లెవెల్లో ఏ మూవీ లేదనే చెప్పుకోవాలి. దీంతో పాటుగా తమిళంలో క్రేజీ యాక్టర్గా ఫేమస్ అయినా యోగిబాబు లక్కీ మ్యాన్ మూవీ రాబోతుంది. ఆర్జేగా మారిన నటుడు బాలాజీ వేణుగోపాల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ లక్కీ మ్యాన్ సెప్టెంబర్1,2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ థియేటర్‌లో కుటుంబ వినోదం, భావోద్వేగాలు, కామెడీ పంచడానికి యోగి బాబు వస్తున్నారు. 

నటుడు శరత్‌ కమార్‌, అమితాష్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పరం పొరుల్‌.ఈ మూవీకి అరవింద్ రాజ్ స్టోరీ తో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా ,మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో..అనిరుధ్‌ ఒక పాట పాడడం విశేషం.ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మిస్టరీ ఆఫ్ టాటూ. ఈ మూవీ థియేటర్లో సెప్టెంబర్ 1, 2023న విడుదల కానుంది. 

హిందీలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గోల్డ్ ఫిష్ మూవీ ott లో సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. డిమెన్షియాతో బాధపడుతున్న ఒక అమ్మాయి, ఆమె తల్లి తన కోసం పడే బాధలను చూపిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంది.  

బ్యాడ్మింటన్ కోచ్‌గా కే కే మీనన్ యాక్ట్ చేసిన మూవీ లవ్ ఆల్. ఈ మూవీ థియేటర్ లో ఇంకా నడుస్తున్నప్పటికీ త్వరలో ott రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది. 

 

సెప్టెంబర్ 7:

అనుష్క శెట్టి(AnushkaShetty), నవీన్ పొలిశెట్టి(NaveenPolishety) లీడ్‌‌‌‌ రోల్స్‌‌‌‌లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి(MissShettyMrPolishetty).రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ..యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మిస్ శెట్టి కథ విషయానికి వస్తే..అనుష్క కు పెళ్లి మీద మంచి ఒపీనియన్ లేకపోవడం వంటి సీన్స్ తో  డైరెక్టర్ చక్కగా చూపించారు ట్రైలర్ లో. ఇక తనకి నచ్చిన అబ్బాయితో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్న అనుష్కకి..నవీన్ తోడవ్వడంతో..ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ అమాంతం పెరిగింది. ఇక వీరిద్దరీ పరస్పర నిర్ణయాలతో..హీరో తన ప్రేమతో అనుష్కని మారుస్తాడా..లేదా అనేది సినిమా అని తెలుస్తుంది. ఈ మూవీలో ఇందులో చెఫ్‌‌‌‌ అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క నటించగా, స్టాండప్‌‌‌‌ కమెడియన్‌‌‌‌ సిద్ధు పొలిశెట్టిగా నవీన్ కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే నెల (సెప్టెంబర్ 7న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

అలాగే అదే రోజున..పఠాన్‌‌ తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్..ఇప్పుడు జవాన్‌‌ గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్‌‌వైడ్‌‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీలో నయనతార హీరోయిన్‌‌గా నటించగా దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌‌లో కనిపించనుంది. విజయ్ సేతుపతి, సునీల్ గ్రోవర్, యోగిబాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్,సాంగ్స్ తో ఆడియన్స్ లో మంచి హైప్ ఉంది. ఇక మెయిన్ గా నవీన్ పోలిశెట్టి, షారుఖ్ ఖాన్ మధ్య బాగా పోటీ కనిపిస్తోంది. నవీన్ పోలిశెట్టి బాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు. హీరో సుశాంత్ రాజ్ పుత్ చిచోరే మూవీతో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యారు. 

అలాగే తమిళంలో హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేస్తున్న మూవీ నూడిల్స్. నూడిల్స్. ఈ మూవీ 8 సెప్టెంబర్ 2023 థియేటర్ లలో రిలీజ్ కానుంది. 
బాహుబలి కట్టప్పగా ఫేమస్ అయినా యాక్టర్ సత్య రాజ్ మెయిన్ క్యారెక్టర్ లో వచ్చిన మూవీ అంగరాగన్. ఈ మూవీ మిస్టరీ,హారర్ జోనర్ లో రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 8న థియేటర్లో రిలీజ్ కానుంది. 

సెప్టెంబర్ 15:

సెప్టెంబర్ 15 న థియేటర్లో మాస్ జాతర షురూ కానుంది. అఖండ వంటి భారీ హిట్ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో రామ్ హీరోగా వస్తున్నమూవీ స్కంద. మాస్ ఆడియన్స్ కు తన యాక్షన్ తో పూనకాలు తెచ్చే బోయపాటి స్కంద తో థియేటర్లో జాతర షురూ చేయునున్నాడు. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్‌ 15న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. 

అలాగే ఈ మూవీకి పోటీగా రాఘవ లారెన్స్ రూపంలో కాస్త గట్టి పోటీనే ఉండబోతోందని చెప్పాలి. రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్‌‌ రోల్‌‌లో నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రజినీకాంత్ చంద్రముఖి మూవీకి సీక్వెల్ గా వస్తుండటంతో..చంద్రముఖి 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

అలాగే ఈ రెండు మూవీస్ కు పోటీగా విశాల్ హీరోగా మార్క్ ఆంటోనీ(Mark antony) అనే పాన్ ఇండియా సినిమా వస్తుంది. 
అధిక రవిచంద్రన్(Adhik ravichandran) తెరకెక్కిస్తున్న ఈ టైం ట్రావెల్ సినిమాలో మరో దర్శకుడు ఎస్జే సూర్య(SJ Surya) కీ రోల్ లో కనిపించనున్నారు.ఈ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్లో రిలీజ్ కానుంది.  

సెప్టెంబర్ 28:

సెప్టెంబర్ 28 డేట్ కోసం వరల్డ్ వైడ్ సినిమా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salar).  కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 28న 2023 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సలార్ సినిమా దాదాపు 5000 థియేటర్స్ లో రిలీజ్ కానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఈవార్త గనక నిజమైతే.. సలార్ మొదటిరోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం. ప్రభాస్ సలార్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్. 

అలాగే మరిన్ని మూవీస్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా..డైరెక్టర్ వీర శంకర్ తెరకెక్కించిన మూవీ గుడుంబా శంకర్(Gudumba Shankar). పవన్ కళ్యాణ్ కి జోడీగా మీరా జాస్మిన్ నటించింది. పవన్ కెరీర్లోనే ఓ స్వాగ్ క్రీయేట్ చేసింది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ సెప్టెంబర్ 2న థియేటర్లో రీ-రిలీజ్ కానుంది. 

సెప్టెంబర్ 22- ది ఎక్స్ ప్యాండబుల్స్ 4,

ది కాశ్మీర్ ఫైల్స్ చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది వ్యాక్సిన్ వార్ మూవీని సెప్టెంబరు 28న థియేటర్ లో రిలీజ్ కానుంది.