కల్వకుర్తి మున్సిపా లిటీ పరిధిలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కల్వకుర్తి మున్సిపా లిటీ పరిధిలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

కల్వకుర్తి, వెలుగు : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డుకు చెందిన 20 మంది బీఆర్ఎస్ నాయకులు శనివారం క్యాంప్ ఆఫీస్​లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్​లో చేరినవారిలో వెల్డండ మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు హన్మనాయక్, చిన్న, బాలునాయక్, చిత్తరి శ్రీను, మక్ బుల్, నాయకులు ఉన్నారు. 

కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఆనంద్ కుమార్, పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, బేడ బుడగ జంగం అధ్యక్షుడు కొండపల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి చిత్తరి శివ రాములు, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. శనివారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కంటోనిపల్లి, వెల్దండ  గ్రామలకు చెందిన 110 మంది రైతులకు ప్లాస్టిక్ క్రేట్‌‌‌‌‌‌‌‌లు, వర్మీ బెడ్‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. గానుగట్టు తండాలో  పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.