పొన్నియిన్ సెల్వన్‌‌‌‌తో సత్తా చాటిన త్రిష

పొన్నియిన్ సెల్వన్‌‌‌‌తో సత్తా చాటిన త్రిష

త్రిష కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఏళ్లయినా ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌‌‌‌గా కొనసాగుతోంది. కిందటేడాది మణిరత్నం సినిమా ‘పొన్నియిన్ సెల్వన్‌‌‌‌’తో మరోసారి సత్తా చాటింది. ఇందులో ఐశ్వర్యరాయ్‌‌‌‌ కూడా నటించినప్పటికీ త్రిషకే ఎక్కువ మార్కులు పడ్డాయి. గత కొన్ని నెలలుగా సరికొత్త మేకోవర్‌‌‌‌‌‌‌‌తో కనిపిస్తున్న త్రిష, బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులకు కమిట్ అవుతోంది. ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలపై ఫోకస్ పెట్టింది. విజయ్‌‌‌‌తో లోకేష్‌‌‌‌ కనకరాజ్‌‌‌‌ తీస్తోన్న చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా నటించనున్న ఆమె.. మరోవైపు అజిత్‌‌‌‌కి జంటగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌‌‌‌లో నటించబోతోంది. ఈ రెండింటిపై ఇంకా క్లారిటీ రాకముందే.. కమల్ కొత్త సినిమాలోనూ ఆమె పేరు తెరపైకొచ్చింది.

కమల్ హాసన్‌‌‌‌తో మణిరత్నం ఓ బిగ్‌‌‌‌ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ‘నాయకుడు’ వచ్చిన ముప్ఫై ఐదేళ్లకు వీరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ‘పొన్నియిన్ సెల్వన్‌‌‌‌’లో త్రిష నటనకు ఇంప్రెస్ అయిన మణిరత్నం.. కమల్ సినిమాలోనూ హీరోయిన్‌‌‌‌గా  తీసుకోబోతున్నారట. ఇప్పటికే కమల్‌‌‌‌కి జంటగా మన్మథ బాణం, చీకటిరాజ్యం చిత్రాల్లో నటించింది త్రిష. ఈ సినిమా కూడా ఓకే అయితే ముచ్చటగా మూడో సారి కలిసి నటించడం కన్‌‌‌‌ఫర్మ్ అయినట్టే. మరోవైపు ‘ద రోడ్‌‌‌‌’ అనే లేడీ ఓరియెంటెడ్‌‌‌‌ మూవీలో నటిస్తున్న ఆమె, మోహన్‌‌‌‌లాల్‌‌‌‌కు జంటగా ‘రామ్‌‌‌‌’ అనే మలయాళ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.