కేటగిరీల వారీగా ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు కలర్స్

కేటగిరీల వారీగా ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు కలర్స్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టారు. ట్విట్టర్ లో వెరిఫైడ్ అకౌంట్లకు కేటాయించే రంగులను మూడు రంగులుగా విభజించారు. కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వ ఖాతాలు ఇలా వేరు వేరు విభాగాలకు వేరు వేరు కలర్స్ తో కూడిన బ్యాడ్జ్ లను కేటాయించారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 

మస్క్ వెరిఫైట్ అకౌంట్లకు కేటాయించిన రంగుల ప్రకారం.. కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వ అధికారిక అకౌంట్లకు గ్రే, వ్యక్తులకు (సెలబ్రెటీ అయినా, కాకపోయినా) బ్లూ టిక్ ను కేటాయించారు. గత కొన్ని రోజుల క్రితం నుంచే వెరిఫైయింగ్ ప్రాసెస్ మొదలుపెట్టిన మస్క్​.. తాజాగా ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చారు. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేయకముందు ప్రభుత్వ అధిపతులు, క్రికెటర్లు, సినీతారలు, ఇతర సెలబ్రిటీల ఖాతాలను తనిఖీ చేసిన తరువాతే బ్లూటిక్‌ ఇచ్చే వారు. కానీ.. ప్రస్తుతం బ్లూ టిక్ తో పాటు మరో రెండు రంగులను అదనంగా చేర్చారు.