Twitter Data leak : ట్విట్టర్ కీలక డేటా లీక్.. గిట్హబ్ సైట్లో షేర్

Twitter Data leak : ట్విట్టర్ కీలక డేటా లీక్.. గిట్హబ్ సైట్లో షేర్

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ కు సంబంధించిన సోర్స్ కోడ్ లీకైనట్లు అమెరికా మీడియా వెల్లడించింది. కంపెనీ నిర్వహణకు కీలకమైన ఈ సోర్స్ కోడ్.. కొన్ని భాగాలను గిట్ హబ్ అనే సైట్ లో షేర్ చేసినట్లు ట్విట్టర్ గుర్తించింది. అయితే, ట్విటర్ వినతి మేరకు ఈ కోడ్ ను గిట్ హబ్ తన సైట్ లో నుంచి తొలగించినట్లు తెలిపింది. 

మరోవైపు ‘ఫ్రీ స్పీచ్ ఎంతూసియాస్టిక్’ (Free Speech Enthusiast) ఐడీతో లీక్ చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టేందుకు ట్విటర్.. కాలిఫోర్నియాలోని జిల్లా కోర్టును ఆశ్రయించింది. అయితే, సోర్స్ కోడ్ ఒక్కటే లీక్ అయిందా లేక సంస్థకు సంబంధించిన కీలక సమాచారం ఏమైనా లీక్ అయిందా అన్నదానిపై ట్విట్టర్ స్టడీ చేస్తోంది. ఈ పనిచేసినవాళ్లను త్వరలో పట్టుకునే ఆలోచన చేస్తోంది.