కంటెంట్ వాయోలేషన్ జరిగినప్పుడు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినప్పుడు.. నిబంధనలు ఉల్లఘించినప్పుడు లేదా ఏజ్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయిపోవడం చూస్తుంటాం. కానీ, ప్రపంచంలో పేరు పొందిన రెండు ప్రముఖ న్యూస్ ఛానెల్స్ ల సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయ్యాయి.
ట్విట్టర్ ఎవ్వరినీ వదలడం లేదు. రూల్స్ పాటించని వాళ్లెవరికైనా పరిణామం ఎదుర్కోవల్సిందే అంటున్నారు. తాజాగా సబ్ స్క్రిప్షన్ తీసుకోని ట్విట్టర్ ఖాతాలకు నోటీసులు ఇవ్వకుండా బ్లూటిక్ తొలగించారు. అందులో దేశ నేతలు, టాప్ బిజినెస్ మ్యాన్స్, యాక్టర్స్ ఉన్నారు.
తాజాగా, ట్విట్టర్ మరో సాహసానికి ఒడిగట్టింది. ప్రపంచంలో మేటి న్యూస్ ఛానల్స్ లో ఒకటిగా ఉన్న ANI, NDTV సంస్థల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేసింది. ట్విట్టర్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా తమ ఖాతాలను లాక్ చేయడంపై ఈ సంస్థలు మండి పడుతున్నాయి.
ANI, NDTV ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే.. ‘ఏజ్ రిస్ట్రిక్షన్ కింద మీ ఖాతాను లాక్ చేశాము. మీకు తప్పని సరిగా 13 సంవత్సరాలు నిండి ఉండాలి’ అంటూ నోటీస్ మెసేజ్ కనిపించింది. యూజర్లకు కూడా ‘దిస్ అకౌంట్ డస్ నాట్ ఎక్సిస్ట్’అని కనిపిస్తోంది.