ట్విట్టర్ కు కర్ణాటక కోర్టు ఝలక్.. రూ.50 లక్షల ఫైన్

ట్విట్టర్ కు కర్ణాటక కోర్టు ఝలక్.. రూ.50 లక్షల ఫైన్

కొన్ని ట్వీట్లు,  ఖాతాలను తొలగించాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతటితో ఆగకుండా రూ. 50 లక్షల జరిమానా కూడా విధించింది. ఆర్డర్ ఆపరేషన్‌పై స్టే విధించాలన్న ట్విట్టర్ అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది.

2021 ఫిబ్ర‌వ‌రి నుంచి 2022 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం ప‌దిసార్లు ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించినట్లు ట్విట్ట‌ర్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్న‌ది. మ‌రో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తీసివేయాల‌ని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల‌కు వ్యతిరేకంగా ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను ఈ రోజు కొర్టు కొట్టిపారేసింది. బ్లాకింగ్ ఆర్డర్‌ను పాటించడంలో జాప్యం చేసినందుకు ట్విట్టర్‌లో జరిమానా విధించినట్లు కోర్టు తెలిపింది.