కవిత వర్సెస్ రేవంత్..ట్విట్టర్ వేదికగా ఫైట్

కవిత వర్సెస్ రేవంత్..ట్విట్టర్ వేదికగా ఫైట్

ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ మధ్య కామెంట్ల యుద్దమే జరిగింది. ఒకరికొకరు పోటీ పడి విమర్శలు చేసుకున్నారు. తొలుత తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ తాకట్టు పెట్టారని డీకేతో రేవంత్ ఉన్న ఫోటోను కవిత పోస్ట్ పెడితే..ఎవరు తాకట్లు పెట్టారో అందరికీ తెలుసంటూ మోడీకి కేసీఆర్ వంగి నమస్కరిస్తున్న ఫోటోను రేవంత్ పోస్ట్ చేశారు. అప్పుడు ఢిల్లీ..ఇపుడు ఢిల్లీ కానీ ఇపుడు వయా బెంగళూరు. 

కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవానని తాకట్టు పెట్టడం, ఢిల్లీ గల్లీలలలో మోకరిల్లడం అని కవిత్ పోస్ట్ చేశారు. దీనికి  కౌంటర్ గా గల్లీలో సవాళ్లు..ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు. జగమెరిగిన నిక్కర్..లిక్కర్ లాజిక్కు అని రేవంత్ కామెంట్ పెట్టారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన ట్వీట్ ఫైట్ ను నెటిజన్లు ఆసక్తిగా తిలకించారు.