కవిత వర్సెస్​ రేవంత్ ... పోటాపోటీగా విమర్శలు

కవిత వర్సెస్​ రేవంత్ ... పోటాపోటీగా విమర్శలు

హైదరాబాద్​, వెలుగు: ఇటీవల కేటీఆర్, రేవంత్ మధ్య ఎక్స్‌‌‌‌లో మాటల యుద్ధం జరిగితే.. తాజాగా కవిత, రేవంత్‌‌‌‌లు పోటాపోటీగా విమర్శలు గుప్పించు కున్నారు. తొలుత తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ తాకట్టు పెట్టారని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్​తో రేవంత్ ఉన్న ఫొటోను కవిత పోస్ట్ చేస్తే.. ఎవరు తాకట్టు పెట్టారో అందరికీ తెలుసంటూ మోదీకి కేసీఆర్ వంగి నమస్కరిస్తున్న ఫొటోను రేవంత్​ పోస్ట్ చేశారు. 

"అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగ ళూరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం. ఢిల్లీ గల్లీలలో మోకరి ల్లడం" అని కవిత పోస్ట్ పెట్టారు. దానికి కౌంటర్​గా "గల్లీ లో సవాళ్లు.. ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడు కోళ్లు. ఇది కేసీఆర్ మ్యాజిక్కు. జగమెరిగిన 'నిక్కర్'.. లిక్కర్ లాజిక్కు" అని రేవంత్  రిప్లై ఇచ్చారు.