
కొల్లాపూర్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బసవ పున్నయ్య కోరారు. ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రకటించాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ, న్యాయపరమైన అంశాలు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. సంఘం నాయకులు తాటికొండ కృష్ణ, రాజశేఖర్, జగదీశ్వర్, రామచంద్రం, జలకం మద్దిలేటి పాల్గొన్నారు.