ఎయిర్ షోలో ఢీ కొన్న యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి

ఎయిర్ షోలో ఢీ కొన్న యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి

అమెరికా డల్లాస్ లో జరిగిన ఎయిర్ షోలో రెండు ఎయిర్ క్రాప్ట్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ పోర్టులో వింగ్స్ ఓవర్ డల్లాస్ పేరుతో ఎయిర్ షో నిర్వహించారు. ఎయిర్ షో సందర్భంగా బోయింగ్ B-17, బెల్ P-63 ఎయిర్ క్రాప్ట్స్ గాల్లో ఢీకొని కూలిపోయాయి. ఎయిర్ క్రాప్ట్స్ కిందపడటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనపై  ప్రమాద ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) విచారణకు ఆదేశించాయి. 

మాజీ సైనికోద్యోగుల దినోత్సవం సందర్భంగా ఎయిర్ షో నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఎయిర్‌షోను వీక్షించేందుకు దాదాపు 6 వేల మంది వరకు అక్కడికి వచ్చారు. అయితే . ఈ షోను వీక్షిస్తున్న ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. దీనిపై డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు హృదయ విదారకంగా ఉన్నాయని అన్నారు.