తిమ్మాపూర్, వెలుగు: గంజాయి సేవిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్చేశారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జయ్యారం గ్రామానికి కోరండ్ల రఘువర్ధన్ రెడ్డి, చింతకింది శ్రీకృష్ణ కరీంనగర్జిల్లా తిమ్మాపూర్లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. రఘువర్ధన్ రెడ్డి లారీ డ్రైవర్గా పని చేస్తుండగా, శ్రీకృష్ణ తిమ్మాపూర్లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.
వీరు కొంతకాలంగా ఇక్కడే ఓ హాస్టల్లో ఉంటున్న వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ తాగుతున్నారు. పోలీసులు ఆదివారం పక్కా సమాచారంతో వెళ్లి రఘువర్ధన్ రెడ్డి, శ్రీకృష్ణను అరెస్ట్చేశారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల గంజాయి, బైక్స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి పరారైనట్లు పేర్కొన్నారు. హాస్టళ్ల నిర్వాహకులు తమ విద్యార్థులపై నిఘా పెట్టాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
