
ఓ స్థలం వివాదం విషయంలో ఇద్దరు అన్నదమ్ములను తుపాకీతో కాల్చి చంపి కలకలం సృష్టించాడు ఓ కానిస్టేబుల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పరగనాస్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని అమ్‌దంగ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టికులియాకు చెందిన ఆరుప్ మండల్, సుమంత మండల్ అనే ఇద్దరు అన్నదమ్ములకు ఓ స్థలం విషయంలో అదే ప్రాంతానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్‌తో గత కొన్ని సంవత్సరాలుగా తగాదాలు నడుస్తున్నాయి. స్థలం విషయంలో గొడవలు రోజురోజుకీ పెరగడంతో శుక్రవారం ఆ ఇద్దరు అన్నదమ్ములపై కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వారిపై కాల్పులు జరిపిన అనంతరం కానిస్టేబుల్ అక్కడనుండి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.